చూడ చక్కని అందం మీ సొంతం

మేకప్ చిట్కాలు

Beauty-with-makeup-
  • మేకప్ తో మాయ చేయవచ్చు.. కొన్ని కిటుకులతో సహజ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు..
  • మీ చర్మ తత్వానికి సరిపడే ప్రైమర్ ని ఎంచుకోవాలి… ఇది బేస్ ను ప్రకాశవంతంగా మారుస్తుంది..
  • ఒక రకం ఫౌండేషన్ కి మరో రకం హై లైటర్ ను చేర్చి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి..
  • బుగ్గలు సహజంగా మెరిసినపుడే మోము మరింత అందంగా కన్పిస్తుంది..కాబట్టి ఆపిల్స్ గా నిగ నిగ లాడే చెంపలకు గులాబీ రంగు షేడ్ మరింత వన్నె తెస్తుంది..
  • కాటుక లాంటి కోహ్ల్ (పెన్సిల్ లాంటిది) తో కాకుండా మస్కారా వేసుకుంటే కళ్ళు మరింత ఆకర్షణీయంగా కన్పిస్తాయి..
  • కను బొమ్మలకు ఓ చుక్క నూనె రాసి ఎయె బ్రష్ తో మృదువుగా దువ్వండి.. , నల్లగా, ఒత్తుగా ముఖం లో ప్రస్ఫుటంగా కన్పిస్తాయి..
  • చివరగా అధరాలకు అదిరిపోయే రంగులు కాకుండా సహజంగా కన్పించేలా న్యూడ్ లిప్ స్టీక్ ను వేసుకుంటే సరి. దీనికి పారదర్శకమైన లిప్ గ్లాస్ తో మెరుగులద్దితే చూడ చక్కని ముద్దుగుమ్మ మరి మీరే అవుతారు. ట్రై చేయండి..

తెర (సినిమా) వార్తలకు : https://www.vaartha.com/news/movies/