ఆకట్టుకునే శరీరాకృతి

అందమే ఆనందం

Beauty tips-Impressive physique

నేడు స్త్రీలకి పనులు తక్కువై శరీరం విపరీతంగా లావెక్కుతోంది. ముఖ్యంగా 20ఏళ్ల యువతులు, వధువ్ఞల కోసం వెతికే పెళ్లికాని ప్రసాదులకు పాపం లావ్ఞగా ఉన్న అమ్మాయిలే ఎక్కువగా తగలటంతో పెళ్లి కాకుండా ఉండిపోతున్నారని ఒక సర్వేలో తేలింది.

 ఆడపిల్లల చేత ఇంటిపనులు చేయించటం ముఖ్యం. హై.బి.పి, షుగర్‌, హార్ట్‌ ఎటాక్‌ రాకుండా వాకింగ్‌ కూడా చేస్తుండాలి. గుడికెళ్లటంతో భుక్తిముక్తి కూడా లభిస్తుంది. ఇంట్లో చీపురు పెట్టి ఊడ్చి ముగ్గువేసే ఆడపిల్ల నేడు కనపడటం లేదు.

పనిమనిషి ఉందనే నిర్లక్ష్యం ఎక్కువైంది. శారీరక శ్రమంటే బరువ్ఞలు మోయక్కర్లేదు. మెట్లు ఎక్కి దిగండి. బట్టలు జాడిం చండి. …వాషింగ్‌ మిషన్‌ ఉంది అనుకుంటే మీ అపార్ట్‌మెంట్‌ పై నించి కిందకి కనీసం 3ఫ్లోర్స్‌ ఎక్కి దిగండి చాలు పదిసార్లు అలసే దాకా. వంటిల్లే వ్యాయామశాల.

భుజాలనొప్పికి, మిక్సీ వాడకుండా చక్కగా బండరోలు వాడండి. మణికట్టు, చేతివ్రేళ్లకు మంచి వ్యాయా మం. పిండి తడిపి బాగా మెత్తగా పిసకటం, వత్తటం వేయించటం, కాల్చటం వల్ల చేతులకి వ్యాయామం అవ్ఞతుంది. అంట్లు తోమటం, బాత్రూం టైల్స్‌ శుభ్రం చేయటం, టబ్స్‌పాచిని వదలగొట్టడం, గార్డె నింగ్‌, మొక్కల్ని కొమ్మలు కత్తిరించటం, నీరుపోయటం వల్ల చేతి కండరాలు గట్టిపడతాయి. స్వయంగా షాపుకెళ్లి షాపింగ్‌ చేయటం తో మానసికంగా రిలాక్స్‌ అవుతారు.

Beauty tips-Impressive physique
Beauty tips-Impressive physique

నా పని నేను చేయాలి అనే గాంధీజీ మాటల్లో ఎంతో సత్యం, ఆరోగ్యం ఇమిడి ఉన్నాయి. పనిమనిషిని మానిపించి, ఆడ,మగ, పిల్ల పెద్ద ఎవరైనా సరే వారి కప్పు, గ్లాసు, కంచం తోమి కడగడం, ఎవరి బట్టలు వారు ఉతికి ఆరేయడం మొదలుపెడితే రోగాలు మటు మాయం సుమా! అలాగే చిన్నా చితకా ఆరోగ్యంగా ఉండాలంటే కుర్చీకిరెస్టు ఇవ్వాలి.

ఆ…మమ్మల్ని నేలమీద కూలబడమంటారా అని కాదు. అలా కుర్చీకి అతుక్కుపోతే, లాంగ్‌సిట్టర్‌ అయితే హార్టు, షుగర్‌ పేషెంట్స్‌ అవటం. ఖాయం. డెస్క్‌ జాబ్‌ చేసే వారి సిట్టింగ్‌ అవర్స్‌ని చూడండి. నిద్రకి ఎనిమిది గంటలు వదిలేస్తే మిగతా 90శాతం అలా కూచుని టి.వి.తో, ఆఫీసుపనితో గడిపేస్తారు. ఇలా కూచోటంతో మెటబాలిక్‌, కార్డియో వాస్క్యులర్‌ సిస్టంకి నష్టం కలుగుతుంది.

దీనితో హైపర్‌ టెన్షన్‌, కార్డియో వాస్కులర్‌ డిసీజ్‌, ఒబెసిటీ, టైప్‌-2 షుగర్‌, కేన్సర్‌ వచ్చే ఛాన్సు ఎక్కువ. అమెరికన్‌ పరిశోధన ప్రకారం, అలా కుర్చీకి అతుక్కుపోవటం త్వరగా చ్డాౖని కొనితెచ్చుకోవటమే.

పైగా హిప్‌, స్పైన్‌, షోల్డర్‌, నెక్‌పెయిన్‌కి బాధ్యులం మనమే అవ్ఞతాం. కండరాలు ఒకే పొజిషన్‌కి అలవాటు పడి పూర్‌ బాడీ బాలెన్స్‌, కదలకపోవటం జరిగే ప్రమాదం ఉంది. కీ-బోర్డుపై వంగి టైపింగ్‌ చేస్తే అలా వంగి నడవటమే అలవాటు అవుతుంది.

కాళ్లను క్రాస్‌ చేసి కూచుంటే హిప్‌, లోయర్‌ బాడీ ప్రభావితం అవ్ఞతుంది.మరి లాంగ్‌ సిట్టింగ్‌కి ఎలా బ్రేక్‌ ఇవ్వాలి? మొబైల్‌లో ప్రతి గంటకీ ఐదునిమిషాలు బ్రేక్‌ ఇవ్వాలి అనేలా అలారం సెట్‌ చేయాలి. టి.వి ముందు అలా కూలబడకుండా కాసేపు అటు, ఇటు నడుస్తూ కళ్లకు కూడా విశ్రాంతి ఇవ్వాలి.

ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లు పచ్చికూరగాయలను ఆహారంగా తీసుకోండి. ఇవి ఆకలిమితంగా ఉండటానికి జ్ఞాపకశక్తికి చక్కని శరీరాకృతికి మంచి ఛాయ రావడానికి తోడ్పడు తుంది.

మధ్యాహ్న భోజనంలో అన్నం ఆకుకూరలు,పప్పు, మజ్జిగ తీసుకోవాలి. భోజనానికి ముందుగా ఒక గ్లాసు నీరు త్రాగాలి. ఒక టమాట లేదా ఓ దోసకాయ మిరియాలపొడి చల్లుకు తినాలి. కాఫీ, టీలు చాలా వరకు తగ్గించాలి. ఒకటి లేదా రెండు సార్లు తాగితే పరవాలేదు.

నిమ్మరసం వారానికి ఒకసారి తాగితే ఎంతో మంచిది. అంతే కాకుండా వర్క్‌ చేసేటపుడు అలాగే కుర్చీలో కాకుండా కొంచెం సేపు ఎక్సర్‌సైజ్‌ బాల్‌పై కూచుంటే మజిల్స్‌ యాక్టివ్‌గా ఉంటాయి.

ఫోన్‌ని ఎప్పు డూ నించునే రిసీవ్‌ చేసుకుని మాట్లాడండి. రెండు నిము షాలైనా నించునే ప్రయత్నం చేయాలి. ఇక కాస్త దూరం అయినా నడవటం ఫ్రెండ్స్‌తో, మెసేజ్‌ పంపకుండా వారి దగ్గరకు నడచు కుని వెళ్లి మాట్లాడటం చేయాలి. లిఫ్ట్‌ బదులుమెట్లను ఎక్కి దిగాలి.

మీరు స్కిప్పిం గ్‌ లేదా వా కింగ్‌ క్రమం తప్ప కుం డా చేస్తే మీ శరీరా కృతి మీ చేతుల్లోనే ఉంటుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/