అమ్మయ్యాక అందంగా..!

అందమే ఆనందం

Beauty tips for new mums

పిల్లలు పుట్టాక అందం తగ్గిందని బాధపడే మహిళలు ఎంతమందో.. హార్మోన్లు, మందులు కొంత కారణమైతే , పిల్లల ఆలనా, పాలనలో పడి చేసి అశ్రద్ధ ఇంకో కారణం.. అలా కాకూడదంటే , మీకు మీరు కొంత సమయం కేటాయించుకోవాలి మరి… రాత్రిళ్ళు,చర్మం తనకు తానూ, కొన్ని మార్పులను చేసుకుంటుంది.. శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తుంది.. మీరు చేయాల్సిందల్లా బయట నుంచి దాన్ని కాస్త శుభ్రంగా ఉంచటమే. కాబట్టి. పడుకునే ముందు తక్కుగ గాఢత ఉన్న క్లేన్నెర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.. రెండు, మూడు రోజులకోసారి ఆవిరి పట్టాలి..

వారానికి ఒక సారి స్క్రబ్ ను ఉపయోగిస్తే మృతకణాలు తొలగటంతో పాటు ముఖమూ మృదువుగా మారుతుంది. స్నానం సమయంలో సెనగపిండి, బియ్యంపిండి ని సమపాళ్లలో తీసుకుని నీటితో కలిపి ముఖానికి రుద్ది కడిగేసినా చాలు. మాయిశ్చరైజర్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.. గుర్తుండటం లేదు అనిపించినా, పిల్లలకు స్నానం తర్వాత తప్పక రాస్తారు కదా. ఆ సమయంలోనే మీ ముఖానికి పట్టించేయండి.. వాళ్ల బాడీ ఆయిల్ లోషన్ దేన్నైనా రాసుకోవచ్చు.. ఇది సులువుగానే అన్పిస్తోంది కదూ..

నాడి (ఆరోగ్యం -అలవాట్లు) కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/health1/