ఫేస్ ఆయిల్ వాడుతున్నారా ?

చర్మ సంరక్షణ

చర్మాన్ని కోలుకునేలా చేయటంతో పాటు చర్మానికి రక్షణ పొరలా పేస్ ఆయిల్స్ పనిచేస్తాయి.. చర్మానికి కాంతిని, తాజా ధనాన్ని ఇచ్చే సౌందర్య ఉత్పత్తుల్లో ఫేస్ ఆయిల్ ఒకటి.. ఏ రకం చర్మం వారికి ఎటువంటి ఫేస్ ఆయిల్ సరిపోతుందో చూద్దాం.

చర్మంలోని నూనె గ్రంధులు నూనెను ఎక్కువగా ఉత్పత్తి చేయటం వల్ల చర్మం జిడ్డుగా అన్పిస్తుంది.. ట్రీ, లేదా వేపనూనె అధికంగా నూనె ఉత్పత్తిని నియంత్రిస్తాయి… బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను సమూలంగా తొలగిస్తాయి..

పొడి చర్మం ఉన్నవారికి అన్ని రకాల ఫేస్ ఆయిల్స్ నప్పుతాయి.. పెద్ద అణువులున్నా ఫేస్ ఫేస్ ఆయిల్స్ చర్మం మాన్తా పుట్టకుండా చూస్తాయి.. ద్రాక్ష, దానిమ్మ, అవకాడో ఫేస్ ఆయిల్స్ లో ఏది ఎంచుకున్నా సరే .

సాధారణ చర్మం గల వారిలో చర్మ పొడిబారటం చాల తక్కువ .. వీరిలో ఫేస్ ఆయిల్స్ చర్మానికి తేమను అందించి, చర్మం స్వభావాన్ని సంరక్షిస్తాయి.. అలా కాకుండా బాదాం నూనె వంటివి ఉపయోగిస్తే చర్మం మంట పుట్టటం, పొడిబారటం వంటి సమస్యలు మొదలవుతాయి.

‘స్వస్థ’ (ఆరోగ్య సంబంధిత విషయాలు) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/health/