పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండండి

దుబ్బాకలో క్రైస్తవ భవనం నిర్మిస్తాం..మంత్రి హరీశ్‌

minister Harish Rao

సిద్దిపేట: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ ఫాస్టర్స్, క్రైస్తవ మత పెద్దలతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండండి. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. అన్ని గ్రామాల నుంచి ఫాస్టర్స్ వచ్చి దివంగత రామలింగారెడ్డి కుటుంబానికి, టిఆర్ఎస్ కు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలన్నారు.

దేశంలోనే ఏ ప్రభుత్వం జరపని విధంగా అధికారికంగా క్రిస్మస్ పండుగను తెలంగాణ ప్రభుత్వమే జరుపుతున్నదని గుర్తు చేశారు. ఇన్నేండ్ల పాలనలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు క్రైస్తవులకు చేసింది ఏమీ లేదన్నారు. క్రిస్మస్ పండుగను మంత్రులు, జిల్లా కలెక్టర్లతో అధికారికంగా జరిపించిన ఘనత కేవలం సిఎం కెసిఆర్‌ రామలింగారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నేను బాధ్యత తీసుకుని దుబ్బాకలో క్రైస్తవ భవనం నిర్మాణంతో పాటు పరలోక యాత్ర వాహనం అందిస్తానని హామీ ఇచ్చారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/