తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలి..చేపల వేటకు ఎవరూ వెళ్లొద్దు

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేటి నుంచి బుధవారం వరకు ఉత్తరకోస్తాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో కూడి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది. ఈనేపథ్యంలో సిఎం జగన్‌ ఎంఫాన్ తుపాను విషయంలో జాగ్రత్తగా ఉండాలని… తుపాను మన రాష్ట్రం వైపు వస్తే దాన్ని ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. రెవెన్యూ, వైద్యశాఖ, విద్యుత్తు, పౌరసరఫరాల అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పారు. తుపాను వస్తే ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సముద్రంలో చేపల వేటకు ఎవరూ వెళ్లవద్దని సూచించారు. తుపాను వస్తే ఏం చేయాలనే దానిపై అధికారులు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/