ఉద్యోగంలో నెగ్గుకురావాలంటే..

ఉద్యోగంలో చేరగానే కాదు. దాన్ని ఎంత సమర్ధంగా నిర్వహిస్తున్నామనేది కూడా ముఖ్యమే. నైపుణ్యాలు పెంచుకోవడం, ముఖ్యమైన విషయాలు తెలుసుకోకపోవడం, మొహమాటం, ఇతరులతో పోల్చినపుడు వెనుకబడిపోవడం, ఇవన్నీ ఉన్నతి మెట్లు ఎక్కడానికి ఆటంకంగా మారతాయి. దాంతో క్రమంగా పనిపై ఆసక్తి తగ్గుతుంది.

Be good in Job
Be good in Job working
  • ఉద్యోగ జీవితం అయితే యాంత్రికంగా మారుతుంది. లేదా విపరీతంగా ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఎదురవుతుంది. వాస్తవానికి పైన చెప్పిన సమస్యలు పెద్దవేం కావు. కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకుంటే మనంతట మనమే వాటిని పరిష్కరించుకోవచ్చు. ముందు సంస్థ పనితీరు, వ్యవహారాలన్నింటిని వీలైనంత త్వరగా అర్ధం చేసుకోగలగాలి. చేరిన కొత్తల్లో ఎవరికీ పని తెలియకపోవచ్చు.
  • కానీ నేర్చుకోవడంలో వేగం ఉండాలి. ఫాస్ట్‌లెర్నర్‌లుగా మారాలి. అలా నేర్చుకోవడం ఒక సవాల్‌. కాబట్టి పివేళలకు పరిమితులు పెట్టుకోకుండా అవసరం అనుకుంటే ఎక్కువ గంటలు కష్టపడగలగాలి. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే కొన్ని లక్ష్యాలను రూపొందించుకోవడం తప్పనిసని. అవి ఉన్నతంగా, ఆచరణీయంగా ఉండేలా చూసుకోవాలి.
  • వీటిల్లో స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు రెండూ ఉంటే మరీ మంచిది. వాటికి అనుగుణంగా ప్రణాళికలు రచించుకోవడం, అవసరాన్ని బట్టి మార్పు చేర్పులకు సిద్ధంగా ఉండటం వంటివన్నీ లక్ష్యానికి చేరువ చేస్తాయి. ఆఫీసులో చేరిన మొదట్లో బెరుకు సహజం.
  • క్రమంగా ఆ పరిసరాలకు అలవాటు పడతాం. ముందు అక్కడి వాతావరణాన్ని గమనించాలి. కొత్త చేరిన వారికి అన్ని విషయాలు తెలియవు. అందుకు బాధపడకుండా, భయపడకుండా సహోద్యోగులను, అధికారులను, స్నేహితులను అడిగి తెలుసుకోవాలి. ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే పరుగుల ప్రపంచంలో ముందుకు వెళ్లగలం.
  • ఎవరేం చెప్పినా పూర్తిగా వినాలి. అవసరమైనంత వరకే తీసుకోవాలి. సందేహాలను అడిగి తెలుసుకోవాలి. సాంకేతిక నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. అప్పుడే మనం కూడా పోటీలో నిలువగలం.
  • కొందరు వారం మొత్తంలో 60-70 గంటలు పనిచేసే వారు ఉంటారు. త్వరగా వస్తారు. త్వరగా పనులు మొదలుపెడతారు. వారి లక్ష్యాలను అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేస్తారు. సంస్థ అలాంటి వారిని ఎప్పుడూ గుర్తిస్తుంది. కొత్త అవకాశాలే కాదు, పదోన్నతులూ కల్పించి ప్రోత్సహిస్తుంది.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/devotional/