నేరస్థుల పార్టీని నమ్మటానికి వీల్లేదు

AP CM Chandrababu Naidu
AP CM Chandrababu Naidu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు ఈరోజు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడతు నిన్నంతా జగన్‌ హైదరాబాద్‌లోనే ఉన్నాడంటే మరో కుట్రకు పన్నాగం పన్నుతున్నాడని గ్రహించాలని ఆయన పార్టీ నేతలను ఆప్రమత్తం చేశారు. నేరస్థుల పార్టీని ఎక్కడా నమ్మటానికి వీల్లేదని తేల్చిచెప్పారు. పింఛన్‌ డబ్బులు ఇప్పటికే లబ్ధిదారులకు అందాయని సీఎం చెప్పారు. నాలుగైదు రోజుల్లోనే పసుపుకుంకుమ, అన్నదాతా సుఖీభవ, రుణమాఫీ డబ్బులు కూడా ఖాతాల్లో జమవుతాయన్నారు. అన్నదాతా సుఖీభవ కింద ఇప్పటికే వెయ్యి రూపాయలు జమయ్యాయని, మరో రూ.3 వేలు కూడా జమవుతున్నాయని పేర్కొన్నారు. చెక్కులు చెల్లవని ప్రచారం చేస్తున్న వారికిది చెంపచెట్టు కావాలన్నారు. లబ్ధిదారుల సంక్షేమానికి అడ్డుకునేందుకు ఎంతటి కుట్రలకైనా వైఎస్‌ఆర్‌సిపి తెగపడుతుందని విమర్శించారు.
ఐదేళ్ల తెదేపా ప్రభుత్వం వల్ల లాభం జరిగిందా? అంటే.. ప్రజలు చేతులెత్తి జైకొట్టే పరిస్థితుల్లో ఉన్నారని సీఎం చెప్పారు. ఎన్నికలకు మరో వారం మాత్రమే సమయం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/