ఆసియా XIలో భారత్‌ నుంచి నలుగురు

బిసిసిఐ గ్రీన్‌ సిగ్నల్‌.. కెప్లెన్‌గా కోహ్లీ

Sourav Ganguly
Sourav Ganguly

ముంబయి: బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మన్ 100వ జయంతి వేడుకల సందర్భంగా బంగ్లాదేశ్ గడ్డపై మార్చి 18, 21న ఆసియా ఎలెవన్‌, వరల్డ్‌ ఎలెవన్‌ మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. ఆసియా ఎలెవన్‌ జట్టులో పాకిస్థాన్‌ మినహా మిగిలిన ఆసియా దేశాల క్రికెటర్లు ఆడతారు. మరోవైపు వరల్డ్‌ ఎలెవన్‌ జట్టులో మిగిలిన దేశాల క్రికెటర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే ఆసియా ఎలెవన్‌ జట్టు కోసం భారత్ నుంచి నలుగురు క్రికెటర్లని పంపాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించినట్లు సమాచారం తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో పాటు ఓపెనర్ శిఖర్‌ ధావన్‌, పేసర్‌ మహ్మద్ షమీ, స్పిన్నర్‌ కుల్‌దీప్ యాదవ్‌లు ఆసియా ఎలెవన్‌లో ఆడేందుకు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. బిసిసిఐ కి చెందిన ఓ అధికారి తెలిపిన సమాచారం ప్రకారం… ఆసియా ఎలెవన్ తరఫున జరిగే రెండు మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్‌లు వెళ్లనున్నారు. ఆసియా ఎలెవన్ జట్టుకు కోహ్లీ నాయకత్వం వహించనున్నారట. ఆటగాళ్ల షెడ్యూల్‌ని పరిశీలించాకే బంగ్లాదేశ్ బోర్డుకు దాదా సమాచారం తెలిపారట. ‘బిసిబికి గంగూలీ ఆటగాళ్ల జాబితా పంపించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/