హోం క్వారంటైన్‌లోకి సౌరవ్ గంగూలీ

గంగూలీ సోదరుడికి కరోనా పాజిటివ్‌..వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లిన గుంగూలీ

Sourav-Ganguly
Sourav-Ganguly

కోలకతా: బీసీసీఐ చీఫ్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన సోదరుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) సంయుక్త కార్యదర్శి అయిన స్నేహాశీష్ గంగూలీకి కరోనా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే గంగూలీ కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లాడు. అయితే బెంగాల్ ఫస్ట్క్లాస్ మాజీ ఆటగాడైన స్నేహాశీష్ గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతడిని బెల్లె వ్యూ ఆసుపత్రిలో చేర్చారు. ‘గత కొద్దిరోజుల నుంచి  స్నేహాశీష్‌  జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా సోకినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని’ క్యాబ్‌ అధికారి ఒకరు తెలిపారు.  హెల్త్‌ ప్రొటోకాల్స్‌ ప్రకారం సౌరవ్‌ కూడా కొద్దిరోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని దాదా సన్నిహితుడొకరు చెప్పారు. 


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/