అంపైర్లపై చర్యలకు బిసిసిఐ వెనుకడుగు…

bcci
bcci

న్యూఢిల్లీ: నోబాల్‌ గుర్తించని అంపైర్‌పై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఐపిఎల్‌లో భారత అంపైర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో సత్వర చర్యలకు బిసిసిఐ వెనుకంజవేస్తోంది. ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్ల మధ్య గురువారం మ్యాచ్‌ జరిగింది. చివరి బంతికి 7 పరుగులు చేయాల్సి ఉండగా…మలింగ నోబాల్‌ వేశాడు. కానీ ఫీల్డు అంపైర్‌ సుందరం రవి దాన్ని గమనించలేకపోయారు. అతనితో పాటు నందన్‌ ఆ మ్యాచ్‌కు అంపైరింగ్‌ చేశాడు. దీనిపై మ్యాచ్‌ ముగిసిన వెంటనే బెంగుళూరు సారథి కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ల పొరపాట్లపై ఆక్షేపించాడు. అయితే తాజా ఐపిఎల్‌లో కేవలం 11మంది భారత అంపర్లు, ఆరుగురు విదేశీ అంపైర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 56 మ్యాచ్‌లకు తక్కువ సంఖ్యలోనే అంపైర్లు అందుబాటులో ఉండటంతో చర్యలు తీసుకునే అవకాశం లేదు. కానీ…మ్యాచ్‌ రిఫరీ మను నాయర్‌ అంపైర్‌ రవికి నెగిటివ్‌ మార్క్‌ను వేశాడు.

https://www.vaartha.com/news/sports/
మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :