అక్టోబరు 9 నుండి బతుకమ్మ చీరల పంపిణీ

minister-ktr

హైదరాబాద్‌: బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బ‌తుక‌మ్మ చీర‌ల ప్ర‌ద‌ర్శ‌న‌లో మంత్రులు కెటిఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బ‌తుక‌మ్మ చీర‌ల‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం కెటిఆర్‌ మాట్లాడుతూ.. రాష్ర్టంలోని అక్కాచెల్లెళ్ల‌కు ముంద‌స్తుగా బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపారు. అక్టోబ‌ర్ 9 నుంచి బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేయ‌బోతున్నామ‌ని చెప్పారు. ఈ నెల 17వ తేదీ నుంచి బ‌తుక‌మ్మ ప్రారంభం కాబోతోంది. క‌రోనా దృష్ట్యా చీర‌ల‌ను మ‌హిళ‌ల ఇళ్ల వ‌ద్దే ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌న్నారు. మ‌హిళా సంఘాలు చీర‌ల‌ను పంపిణీ చేస్తాయ‌ని తెలిపారు. ఈ ఏడాది 287 డిజైన్ల‌తో బంగారు, వెండి జ‌రీ అంచుల‌తో చీర‌ల‌ను త‌యారు చేశారు. రూ. 317.81 కోట్ల వ్య‌యంతో కోటికి పైగా బతుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేయ‌నున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/