నేటి నుంచి బతుకమ్మ ప్రారంభం

మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలన్న ఎమ్మెల్సీ కవిత

నేటి నుంచి బతుకమ్మ ప్రారంభం
bathukamma

హైదరాబాద్‌: ఈరోజు నుండి తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే వేడుక 9వ రోజునాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. నిజానికి ప్రతి సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. అయితే, ఈసారి కరోనాకు తోడు, వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయలేకపోయింది. దీంతో ఎవరికి వారే ఇళ్ల వద్ద బతుకమ్మను ఆడుకోవాలని ప్రభుత్వం సూచించింది. కాగా, బతుకమ్మ ఆడే క్రమంలో కరోనా నిబంధనలు పాటించాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతి నుంచి బతుకమ్మ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/