సిద్దరామయ్య , డీకే లకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం బొమ్మై

రేపు కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బెంగుళూరు లోని కంఠీరవ స్టేడియం లో సిద్దరామయ్య సీఎంగా మరియు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరితో పాటుగా కొందరు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ సందర్భంగా మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై కాబోయే సీఎం సిద్దరామయ్య మరియు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక ప్రజల కోరికలను తప్పక నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.