టిటిడి జేఈఓగా బసంత్‌ కుమార్‌ బాధ్యతలు

టిటిడి జేఈఓగా బసంత్‌ కుమార్‌ బాధ్యతలు

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) అదనపు జేఈవోగా ఐఏఎస్‌ అధికారి బసంత్‌ కుమార్‌ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన మొదటగా వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయానికి చేరుకున్నారు. ఆనంద నిలయంలోని శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో జేఈవోగా బాధ్యతలు చేపట్టారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ..భక్తుల ద్వారా భగవంతుడికి సేవ చేసే భాగ్యం తనకు కలిగిందని బసంత్‌ కుమార్‌ తెలిపారు. అవినీతి లేకుండా పాలన అందించేందుకు, టిటిడిలో భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/