బార్మర్ ప్రమాదం: మృతుల కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన ప్ర‌ధాని

న్యూఢిల్లీ: రాజ‌స్థాన్‌లోని బ‌ర్మేర్‌-జోధ్‌పూర్ ర‌హ‌దారిపై రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ప్ర‌ధాని మోడీ రూ.2 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారికి కూడా రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు ప్ర‌ధానమంత్రి కార్యాల‌యం ట్విట్ట‌ర్‌లో ఒక ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌ధాన‌మంత్రి నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్‌) నుంచి ఈ నిధుల‌ను అందించనున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఈ ఉద‌యం రాజ‌స్థాన్‌లోని బ‌ర్మేర్ జిల్లాలో బ‌ర్మేర్‌-జోధ్‌పూర్ ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు, ఆయిల్ ట్యాంక‌ర్ ఎదురెదురుగా ఢీకొన‌డంతో పెద్దఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది మ‌ర‌ణించారు. ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/