రెండు రోజులు బారాముల్లా-ఉధంపూర్‌ హైవే మూసివేత

baramulla-udhampur highway
baramulla-udhampur highway


శ్రీనగర్‌: భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా-ఉధంపూర్‌ల మధ్య నున్న హైవేను మూసివేయాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారంలో రెండు రోజులు అంటే ఆదివారం, బుధవారం సాధారణ వాహనాలకు, పౌరులకు ఆ హైవేపై అనుమతించరు అని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ రెండు రోజుల్లో తెల్లవారుఝామున 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాకపోకలను నిషేధిస్తారు. ఈ నిషేధం మే 31 వరకు అమలులో ఉంటుంది. ఉగ్రదాడులను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. పారామిలిటరీ బలగాలు వెళ్లినపుడు సాధారణ వాహనాలకు, పౌరులకు హైవేలపై ప్రయాణించడానికి అనుమతి ఇవ్వొద్దని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/