కుటుంబ సభ్యుల మధ్య పుట్టిన రోజు

యంగ్‌ ప్రొడ్యూసర్‌ బన్నీవాస్‌

Banny vasu

అల్లు అర్జున్‌ తన మొదటి చిత్రం గంగోత్రి తర్వాత బన్నీకిఒక స్నేహితుడిగా పరిచయం అయిన ఉదయ్ శ్రీనివాస్‌ ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపేసి అల్లు ఫ్యామిలీ సపోర్ట్‌తో తెలుగు సినీపరిశ్రమకు వచ్చాడు.

కామన్‌ ఫ్రెండ్‌ద్వారా బన్నీకి పరిచయం అయిన శ్రీనివాస్‌ తర్వాత వెనక్కి చూడలేదు..బన్నీకి స్నేహితుడు కావటంతో ఇండస్ట్రీలో అందరూ బన్నీవాస్‌గా పిలవటం ప్రారంభించారు..

ఆర్యచ ిత్రంలో బన్నీవాస్‌ ఒక చోట తళుక్కుమన్నాడు..

ఆ తర్వాత ఆయన కెరీర్‌ మారిపోయింది.. డిస్ట్రిబ్యూటర్‌గా అవతారమెత్తాడు.. వరుస చిత్రాలు చేస్తూ గుంటూరుజిల్లాలో కూడ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ చేసి సక్సెస్‌ఫుల్‌ డిస్ట్రిబ్యూటర్‌గా పేరొందాడు..

గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో తొలిసారిగా నాగచైతన్య హీరోగా 100పర్సెంట్‌ లవ్‌ చిత్రంతో నిర్మాతగా మారటమే కాకుండా తర్వాత సాయిధరమ్‌తేజ్‌ హీరోగా ‘పిల్లా నువ్వులేనిజీవితం తో సూపర్‌హిట్‌ ప్రొడ్యూసర్‌గా క్రేజ్‌ సొంతచేసుకున్నాడు బన్నీవాస్‌..

జిఎ2 పిక్చర్స్‌ బ్యానర్‌లో నాని హీరోగా భలే భలే మగాడివోయ్ , అల్లు శిరీష్‌ శ్రీరస్తు శుభమస్తు , విజయ్ దేవరకొండ హీరోగా గీత గోవిందం .

సాయిధరమ్‌తేజ్‌ హీరోగా ప్రతిరోజు పండగే వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో యంగ్‌ ప్రొడ్యూసర్‌గా బన్నీవాస్‌ తన కంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం నిర్మాతగా అఖిల్‌ అక్కినేని హీరోగా మోస్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ . కార్తికేయతో చావుకబురు చల్లగా , నిఖిల్‌తో 18 పేజీస్‌ చిత్రాలో రన్నింగ్‌లో ఉన్నాయి.

బన్నీవాస్‌ తన పుట్టినరోజు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరుపుకున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/