ఇకపై ఎటిఎంలో డబ్బుల్లేకుంటే ఫైన్‌

ఆర్‌బిఐ తాజా ప్రతిపాదన

ATM's
ATM’s

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో తీసుకున్నరుణాలు చెల్లించేటప్పుడు ఒక్క రోజు ఆలస్యమైనా బ్యాంకులు వడ్డీవేస్తాయి. మరి అలాంటప్పుడు మనకు ఇవ్వాల్సిన సర్వీసులు కూడా అదేవిధంగా ఇవ్వాలి కదా. అయితే ఎటిఎంలకు వెళ్లినప్పుడు అవి పని చేయట్లేదనో, డబ్బులు లేవనో వాటి ముందు బోర్డులు వేలాడదీస్తుంటారు. దీంతో ఇబ్బందిపడుతున్నది మనమే కదా. దీనిపై బ్యాంకులు ఎందుకు సమాధానం చెప్పవన్నది తేలాల్సిన ప్రశ్న. ఇలాంటి పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు రిజర్వ్‌ బ్యాంకు ఒక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎటిఎంల ముందు గంటల తరబడి నో క్యాష్‌ బోర్డు వేలాడదీస్తే కుదరదు. 3 గంటలకు మించి ఆ బోర్డు ఉంటే, ఆ ఎటిఎం కేంద్రంపై ఆర్‌బిఐ చర్యలు తీసుకుంటుంది. జరిమానా వేసి బ్యాంకుకి పంపిస్తుంది.

ఈ ఫైన్‌ అన్ని ఎటిఎంలకూ ఒకే విధంగా ఉండదు. ఎటిఎం ఉన్న ప్రదేశం, దానికి ఉన్న డిమాండ్‌, వచ్చే కస్టమర్లు అన్నింటినీ లెక్కలోకి తీసుకొని ఫైన్‌వేసి, ఆ నోటీస్‌ను బ్యాంకు శాఖకు పంపిస్తుంది ఆర్‌బిఐ, దేశంలో రోజూ కొన్ని లక్షల ఎటిఎంలు ఇలాగే పనిచేయకుండా డబ్బులు లేకుండా ఉన్నాయి. వాటి వల్ల కొన్ని కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమందైతే ఎటిఎంలలో డబ్బుల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. ఆర్‌బిఐ నిర్ణయం మనకు కలిసొచ్చే అంశమే. ఇలాంటి ఫైన్లు వేస్తేనే బ్యాంకులు జాగ్రత్తపడి ఎటిఎంలలో ఎప్పటికప్పుడు క్యాష్‌ ఫిలప్‌ చేస్తాయని భావించవచ్చు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/