వారి హయాంలోనే బ్యాంకులకు అత్యంత దుర్దశ

Nirmala Sitharaman
Nirmala Sitharaman

న్యూయార్క్‌: మన్మోహన్ సింగ్-రఘురాం రాజన్ హయాంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యంత దుర్భర దశను ఎదుర్కొన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులలో రుణాల ఎగవేత తీవ్రస్థాయిలో ఉందని ఆమె విమర్శించారు. కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫేర్స్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ప్రసగింస్తూ ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రాఘురాం రాజన్ చెబుతున్న ప్రతి మాట ఆయనకే వర్తిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు.

ప్రధానిగా మన్మోహన్ సింగ్, ఆర్‌బిఐ గవర్నర్‌గా రఘురాం రాజన్ ఉన్నపుడే ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యంత దుర్భరమైన దశను ఎదుర్కొన్నాయన్న వాస్తవాన్ని తాను ప్రజల ముందు ఉంచుతున్నానని నిర్మల అన్నారు. ఆ కాలంలో తమకు ఈ విషయమే తెలియదని ఆమె చెప్పారు. ఆర్‌బిఐ చెబుతున్న వివరాల ప్రకారం 201112లో రూ. 9,910 కోట్లు ఉన్న రుణ ఎగవేతలు 201314 సంవత్సరానికి రూ. 2.16 లక్షల కోట్లకు పెరిగాయి. ఎన్‌డి ఎ ప్రభుత్వ 2014 మేలో అధికారాన్ని చేపట్టింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/