జెట్‌ ఎయిర్‌వేస్‌పై దివాలా కోర్టుకు బ్యాంకర్లు!

jet airways
jet airways


ముంబయి: బ్యాంకర్లకు రుణాలు చెల్లింపుల్లో విఫలం కావడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణబకాయిల రికవరీకి బ్యాంకర్ల కూటమి ఎన్‌సిఎల్‌టిలో పిటిషన్‌ దాఖలుచేయాలని నిర్ణయించింది. ఎయిర్‌లైన్స్‌ పునరుద్ధరణ ఇప్పటికే జాప్యం అయిందని, ఐదునెలలు గడిచినా సరే ఇన్వెస్టర్లను సమీకరించుకోలేకపోయినందున రుణాలు మరింత భారం అవుతాయని ముందుగానే వీటిపరిష్కారం కోసం దివాలాకోర్టుకు దాఖలుచేయాలని నిర్ణయించాయి. దివాలాప్రక్రియ కింద జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణ రికవరీకి నిర్ణయించాయి. బ్యాంకర్ల కూటమి సమావేశం సోమవారం సమావేశం అయి ప్రాధమికంగా ఎన్‌సిఎల్‌టికి వెళ్లాలని నిర్ణయించింది. భారతీయ స్టేట్‌బ్యాంకు ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

కేవలం ఒకే ఒక్కరు మాత్రమే ఇన్వెస్టర్లుగా సెబి మినహాయింపులకోసం ఐ ఇన్వెస్టర్‌కు దరఖాస్తు చేసినందున బకాయిలు రావడం కష్టంగా మారుతుందన్న భావనకు వచ్చాయి. బ్యాంకర్లకు ఇప్పటివరకూ ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ నుంచి మాత్రమే దరఖాస్తు అందింది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో మైనార్టీ వాటా కొనుగోలుకు షరతులతో కూడిన ఒప్పందంతో ముందుకువచ్చింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ వివిధ బ్యాంకులకు మొత్తం 14 వేల కోట్ల రుణబకాయిలు చెల్లించాల్సి ఉంది. పరిశ్రమనిపుణులు, ఉద్యోగులు కూడా ఎయిర్‌లైన్స్‌ పునరుద్ధరణకు ఎంతమాత్రం సహకరించడంలేదు. ఎంవి కిని అండ్‌కో నిపుణుడు రవి కిని మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జెట్‌ ఒక ఆర్థికపరిపుష్టి కలిగిన బయ్యర్‌ను అన్వేషిస్తుందని భావించలేమని, సాధ్యమైనంతవరకూ దివాలాకే బ్యాంకర్లు ప్రాధాన్యతనిస్తారన్నారు.

నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ ఉపాధ్యక్షుడు ఆసిమ్‌ వైలాని మాట్లాడుతూ ఈ చర్య తమకు ఎంతో నిరాశకలిగిస్తోందని జెట్‌ పైలట్లసంఘం వెల్లడించింది. నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ ఇతర ఉద్యోగులుకనీసం తమ వేతనాల బకాయిలను అయినా ఎన్‌సిఎల్‌టి ద్వారా సాధించుకోగలమని భావిస్తున్నారు. కంపెనీ సిబ్బంది జీతభత్యాల రూపేణా 400 కోట్లు బకాయిలు పడింది. ఎతిహాద్‌, హిందూజా సోదరులు కంపెనీ రికార్డుల నుంచి రుణం మొత్తం తీరిన తర్వాత మాత్రమే రంగంలోకి రావాలని నిర్ణయించాయి. అంచనాలప్రకారం చూస్తే ఇన్వెస్టర్లు సుమారు 5600 కోట్లు తక్షణమే జెట్‌కు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.

ఎన్‌సిఎల్‌టి ముంబయి శాఖ గత వారం దివాలా కేసుల విచారణను వాయిదావేసింది. ఇద్దరు నిర్వహణ రుణదాతలు షామన్‌ వీల్స్‌అండ్‌ గగ్గర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థలు జెట్‌ ఎయిర్‌వేస్‌పై దావావేసాయి. ఈయితే ఎన్‌సిఎ ల్‌టి వాటిని 20కి వాయిదావేసింది. ఈ కేసులోనే బ్యాంకర్ల కూటమి కూడా పార్టీగా చేరాలని భావిస్తోంది. గడచిన ఏప్రిల్‌ 17వ తేదీ నుంచి జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతపడింది. 22వేల మంది ఉద్యోగులు, ఆరువేల మంది కాంట్రాక్టు సిబ్బందికి ఉపాధి కరువైంది. సోమవారం జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు 16.7త6శాం క్షీణించాయి. ఒక్కొక్క వాటా ధర బిఎస్‌ఇలో 68.30గా నమోదయింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/