బ్యాంకు ఉద్యోగార్థులకు శుభవార్త

Bank Exam
Bank Exam

న్యూఢిల్లీ: ఇక నుండి బ్యాంకు ఉద్యోగాల పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ లోక్‌సభలో ప్రకటించారు. ప్రస్తుతం ఆంగ్లం, హిందీ భాషల్లోనే బ్యాంకు పరీక్షలు రాసే అవకాశం ఉంది.తాజా నిర్ణయంతో ఈ అభ్యర్థులకు మేలు జరగనుంది. ముఖ్యంగా తెలుగు మీడియం నుంచి వచ్చే విద్యార్థులకు ప్రశ్నలు మరింత సులువుగా అర్థమవుతాయి. బీఎస్‌ఆర్‌బీ ఇకపై 13 ప్రాంతీయ భాషల్లో బ్యాంకు పరీక్షలు నిర్వహించనుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/