లాభాల్లో బ్యాంకు షేర్లు

Bank
Bank

ముంబై: రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) మరోసారి 25 బేసిస్‌ పాయింట్లు రెపోరేటును తగ్గించడంతో సోమవారం ట్రేడింగ్‌లో బ్యాంకు షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 1.59శాతం పుంజుకొని రూ.1208.65వద్ద, ఐసిఐసిఐ బ్యాంకు 0.89శాతం పెరిగి రూ.417.60వద్ద కదులుతున్నాయి. మిగిలిన షేర్లలో ఎస్‌బ్యాంకు 3.68శాతం, కోటక్‌ మహీంద్రా బ్యాంకు 1.61శాతం, యాక్సిస్‌ బ్యాంకు 0.49శాతం, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా 0.04శాతం పుంజుకోగా, ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంకు 3.02శాతం, బ్యాంకు ఆఫ్‌ బరోడా 2.20శాతం, ఫెడరల్‌ బ్యాంకు 1.57శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు 1.53శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 1.12శాతం, ఆర్‌బిఎల్‌ బ్యాంకు 0.59శాతం క్షీణించాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/