ఆగస్టు నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు

ఏకంగా 10 రోజుల సెలవు దినాలు

bank holidays in August
bank holidays in August

Mumbai: ఆగస్టు నెలలో భారీగా సెలవులు రాబోతున్నాయి. ఏకంగా 10 రోజులు సెలవు దినాలుగా ఉండటం విశేషం. వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టులో మొత్తం 31 రోజులు . 1వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు . 8వ తేదీన కూడా రెండో ఆదివారం కావడంతో సెలవు. 13వ తేదీన ఇంఫాల్ జోన్‌లో మాత్రం బ్యాంకు సెలవు కాగా మిగిలిన ప్రాంతాల్లో బ్యాంకులు పని చేస్తాయి. 14 రెండో శనివారం కాగా 15వ తేదీ ఆదివారం కావడం, స్వాతంత్ర దినోత్సవం కావడంతో సెలవు దినంగా ఉంది. 16వ తేదీ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో సెలవు దినంగా ఉంది. 19వ తేదీన మొహర్రం పండుగ సందర్భంగా సెలవు. 20వ తేదీన ఓనం కారణంగా సెలవు దినంగా ఉంది. 22 ఆదివారం సెలవు దినం , 28 నాలుగో శనివారం సెలవు, 29 ఆదివారం సెలవు కాగా 30 న జన్మాష్టమి, 31 కృష్ణాష్టమి కావడంతో హైదరాబాద్ లో బ్యాంక్ సెలవుగా ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/