స్టేట్‌ బ్యాంక్‌ కస్టమర్లకు సూచన

SBI says update KYC or bank may freeze your accounts
SBI says update KYC or bank may freeze your accounts

న్యూఢిల్లీ: దేశ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) బ్యాంక్‌ కస్టమర్లకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని స్టేట్‌ బ్యాంక్‌ తెలిపింది. దీనికి సంబంధించి పబ్లిక్‌ నోటీస్‌ కూడా జారీ చేసింది. కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని బ్యాంకింగ్‌ సర్వీసులు ఎలాంటి ఆటంకం లేకుండా పొందాలని సూచించింది. నాన్‌ కేవైసీ బ్యాంక్‌ అకౌంట్లు పనిచేయకపోవచ్చని, స్తంభింపజేస్తామని స్టేట్‌ బ్యాంక్‌ తెలిపింది. అందువల్ల మీరు మీ అకౌంట్‌కు పూర్తి కేవైసీ కలిగి ఉన్నట్లయితే ఇబ్బందులు ఉండవు. రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం..బ్యాంకులు కస్టమర్ల కేవైసీ వివరాలను ఆప్‌డేట్‌ చేస్తూ రావాలి. బ్యాంకులు క్రమానుగుణంగా అప్పుడప్పుడు కస్టమర్ల కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేస్తూ రావాలి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కైవైసీ ఆప్‌డేట్‌ కోసం కస్టమర్లకు గడువు నిర్ధేశించింది. ఫిబ్రవరి 28లోగా అవసరమైన డాక్యుమెంట్లు అందజేసి కేవైసీ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని బ్యాంక్‌ తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/