ప్రధాని మోడీ కి మామిడి పండ్లు పంపిన బంగ్లాదేశ్ ప్రధాని

రాష్ట్రపతి, ప్రధాని, మమత బెనర్జీ సహా ఇతర నేతలకు పంపిణీ

డాక: భారత ప్రధాని నరేంద్రమోడి కి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మామిడి పండ్లను బహుమతిగా పంపారు. 2600 కేజీల ‘హరిబంగ’ రకం మామిడి పండ్లను బంగ్లాదేశ్ నుంచి ఓ ట్రక్కులో పంపించారు. భారత్‌తో స్నేహ సంబంధాలకు గుర్తుగా హసీనా వీటిని పంపినట్టు బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. కోల్‌కతాలోని బంగ్లాదేశ్ అధికారులకు అందిన ఈ మామిడి పండ్లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సహా ఇతర రాజకీయ నేతలకు పంపిణీ చేయనున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/