బంగార్రాజు ట్రైలర్ విడుదల

బంగార్రాజు మూవీ నుండి ట్రైలర్ విడుదల చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. కింగ్ నాగార్జున , చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఇది సిక్వెల్ గా తెర‌కెక్క‌తుంది. ఈ చిత్రంలో నాగ్ “బంగార్రాజు” పాత్రల్లో కనిపించ‌బోతున్నారు. నాగ్‌ కు జోడీ గా రమ్యకృష్ణ, నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే చిత్ర సాంగ్స్ , స్టిల్స్ ఆకట్టుకోగా..మంగళవారం ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు.

చూపులతోనే ఊచకోత కోసేస్తాడు’ అంటూ అమ్మాయిలతో సరసాలు ఆడే బంగార్రాజు పాత్రని పరిచయం చేయడంతో ట్రైలర్ ప్రారంభమైంది. కనిపించిన ప్రతీ అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ.. బంగార్రాజు బుద్దులతో ఊడి పడిన మనవడు చిన బంగార్రాజుగా నాగచైతన్య కనిపిస్తున్నారు. తనకన్నా తెలివైన చదువుకున్న అమ్మాయి లేరని భావించే నాగలక్షిగా కృతిసెట్టి అలరించింది.

అయితే తనకన్నా తింగరిది తెలివి తక్కువ – మందబుద్ది దద్దమ్మ ఈ ఊర్లోనే లేదంటూ నాగలక్షిని టీజ్ చేస్తున్న చిన బంగార్రాజు.. చివరకు ఆమెతోనే ప్రేమలో పడ్డాడు. అలాంటి సమయంలో ఈసారి తన మనవడికి వచ్చిన సమస్య పరిష్కారం కోసం బంగార్రాజు భూమ్మీదకు వచ్చినట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. ఓవరాల్ గా ట్రైలర్ తో సినిమా ఫై అంచనాలు పెంచారు.