షూటింగ్ కు సిద్ధమవుతున్న ‘బంగార్రాజు’!

ఈ నెల రెండోవారంలో ప్రారంభం !

Nagarjuna
Nagarjuna

కింగ్‌ నాగార్జున హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘సోగ్గానే చిన్నినాయనా.. 2016లో విడుదలై బాక్సాఫీసు వద్ద రికార్డులుక్రియేట్‌ చేసింది..కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు..అయితే దీనికి సీక్వెల్‌ ఉంటుందని అపుడే ప్రకటించారు..

‘బంగార్రాజుగా టైటిల్‌ను ఫిక్స్‌చేశారు.. ఈచిత్రం గత ఏడాదిలోనే ప్రారంభంకావాల్సి ఉండగా, కరోనాక్రైసిస్‌కారణంగా వెనక్కి వెళ్లింది.. ఇపుడు ఈమూవీ సెట్స్‌పైకి వెళ్లేందుకు రంగం సిద్ధమైందనితెలిసింది..సీక్వెల్‌ చిత్రం ఫిబ్రవరి రెండో వారంలో స్టార్ట్‌ అవుతుందని సమాచారం.. ప్రీప్రొడక్షన్‌ పనులును కూడ డైరెక్టర్‌ పూర్తిచేశారని తెలిసింది.

కాగా ఈచిత్రం ప్రారంభం తేదీ ఎపుడా అని అభిమానులు తెగ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే..అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మాణంలో ఈచిత్రం రూపొందనుంది. మరిన్నివివరాలను త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/