అబ్బ ముద్దొస్తున్నావ్.. బాస్ అంటూ పవన్ ఫై తన అభిమానాన్ని చాటుకున్న బండ్ల గణేష్

బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా పవన్ లుక్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది. రెడ్ కలర్ టీషర్ట్…బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్..కాళ్లకి వైట్ షూస్ ధరించి పవన్ కళ్యాణ్ కేక పుట్టిస్తున్నాడు. ఈ లుక్ లో పవన్ పూర్తి యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ను ఈ మధ్య కాలంలో ఇలాంటి లుక్ లో కనిపించలేదు. దీంతో పవన్ తాజా లుక్ చూసిన వారంతా తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ను దేవుడి గా కొలిచే బండ్ల గణేష్ ఈ లుక్ ఫై ట్విట్టర్ ద్వారా తన స్పందను తెలియజేసారు. “అబ్బబ్బ… మా బాస్ ను చూస్తుంటే గుండెల్లో దడ దడ మొదలైంది… రక్తం ఉరకలేస్తోంది” అంటూ తన స్పందనను వెలిబుచ్చారు. అంతేకాదు, సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ ను రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక్క చాన్స్ వస్తే, వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తా అని ధీమా వ్యక్తం చేశారు. అబ్బ… ముద్దొస్తున్నావ్ బాస్ అంటూ తన సంతోషాన్ని మరోసారి వ్యక్తం చేశారు. ప్రస్తుతం గణేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.