రాజకీయాలకి బండ్ల గణేష్‌ గుడ్‌ బై!

Bandla Ganesh
Bandla Ganesh

హైదరాబాద్‌: నిర్మాత బండ్ల గణేష్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే టిపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న బండ్ల గణేష్‌ తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. నా వ్యక్తిగత కారణాల తో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీ కి సంబంధించిన వాడిని కాదు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను అంటూ బండ్ల గ‌ణేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/