పవన్ కళ్యాణ్ మీద ఒట్టేసి చెపుతున్న నేను చెపుతుంది నిజం – బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ మీద ఒట్టేసి చెపుతున్న నేను చెపుతుంది నిజం - బండ్ల గణేష్

గత నాల్గు రోజులుగా బండ్ల గణేష్ పేరు మారుమోగిపోతుంది..దీనికి కారణం మా ఎన్నికలే. మొన్నటి వరకు ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న గణేష్..ఒక్కసారిగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు తెలపడమే ఆయన్ను వార్తల్లో నిలిచేలా చేసింది. జనరల్ సెక్రెటరీ పదవికి జీవితా రాజశేఖర్‌పై పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తుండడం తో అంత అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా బండ్ల గణేష్ బయటకు రావడం వెనుక మెగా ఫ్యామిలీ హస్తం ఉందని..వారు చెప్పడం వల్లే గణేష్ జీవిత మీద పోటీ చేస్తున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో ఆ వార్తల ఫై క్లారిటీ ఇచ్చారు.

ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న గణేష్ ను..సదరు యాంకర్ మెగా ఫ్యామిలీ చెప్పడం వల్లే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బయటకు వచ్చి పోటీ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లడుతూ…‘‘పవన్ కల్యాణ్ గారి మీద ఒట్టు. నా తల్లిదండ్రులు, బిడ్డల సాక్షిగా నన్ను ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు రమ్మని చిరంజీవిగారు కానీ, వాళ్ల ఫ్యామిలీవాళ్లు గానీ ఎవరూ చెప్పలేదు. దయచేసి నన్ను నమ్మండి. నా మనస్సాక్షికి నచ్చకే నేను బయటకు వచ్చా.’’ అని స్పష్టం చేశారు.

జీవితా రాజశేఖర్ ఎన్ని మాట్లాడినా.. మెగా ఫ్యామిలీ క్షమించవచ్చేమో గానీ, తాను మాత్రం క్షమించలేనని బండ్ల గణేష్ తేల్చి చెప్పారు. మెగా ఫ్యామిలీ వాళ్లు గొప్పవాళ్లని వాళ్లకు క్షమించే గుణం ఎక్కువని, కానీ తాను అంత గొప్పవాడిని కాదన్నారు. ప్రస్తుతం గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.