మీడియా రంగంలోకి బండ్ల గణేష్..?

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ త్వరలోనే మీడియా రంగంలోకి రాబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిత్రసీమలో అడుగుపెట్టిన బండ్ల గణేష్..ఆతర్వాత నిర్మాతగా మరి పలు బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకొని బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య పలు రాజకీయ పార్టీల ఫై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. నిన్నటికి నిన్న ఆదర్శ దంపతులు అంటూ జీవిత రాజశేఖర్ లపై సెటైర్లు వేశారు.

. ‘లక్ష్మీపార్వతి పెట్టిన అన్న ఎన్టీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నారు. మన రాష్ట్రంలో పార్టీ జెండాలు ఎన్ని ఉన్నాయో అన్ని జెండాలు మెడలో వేసుకున్నారు ఆదర్శ దంపతులు. ఇంకా సీపీఎం, సీపీఐ, ఎంఐఎం మాత్రమే ఉన్నాయి. వాటిలో కూడా చేరి బ్యాలెన్స్ చేయండి అక్కా’ అంటూ సెటైర్ వేశాడు. అంతేకాకుండా జీవిత, రాజశేఖర్ దంపతులు వివిధ పార్టీల్లో చేరిన సందర్భాల్లోని ఫొటోలను సైతం షేర్ చేశాడు. ఇంకా జనసేన పార్టీ కూడా మిగిలి ఉందని కామెంట్ చేయడంతో.. దండం ఎమోజీతో వద్దు అనే విధంగా బండ్ల రిప్లే ఇచ్చాడు.

ఇక తాజాగా ట్విట్టర్ లో ఓ అభిమాని మీరు కూడా ఓ న్యూస్ ఛానల్ పెట్టచ్చు కదా అని ప్రశ్నించగా..దానికి గణేష్ రిప్లయ్ ఇచ్చారు. ఛానెల్‌ పెట్టే పనిలోనే ఉన్నానని తెలిపి సదరు అభిమానిలో సంతోషం నింపారు. మరి నిజంగానే గణేష్ న్యూస్ ఛానల్ పెట్టబోతున్నాడా..? లేక అభిమాని ని నిరాశ పరచడం ఇష్టం లేక ఆలా చెప్పాడా అని అంత మాట్లాడుకుంటున్నారు.