బండ్ల గణేష్ ట్వీట్ త్రివిక్రమ్ పైనేనా..?

బండ్ల గణేష్ చేసిన తాజా ట్వీట్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య వరుసగా ఘాటైన ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు గణేష్. తాజాగా ” మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ కూడా భక్తుడు గానే పొగరుగా ఉంటాడు.. అది మీకు నచ్చినా నచ్చకపోయినా” అంటూ ట్వీట్ చేసి అనేక రకాలుగా మాట్లాడుకునేలా చేసాడు.

కమెడియన్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి అతి తక్కువ టైంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్, అల్లు అర్జున్ , రవితేజ , ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2018లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బండ్ల గణేష్.. ఆ తర్వాత తనకు రాజకీయాలు సెట్ అవ్వవని తెలిపి రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. ఈ మధ్య సీఎం కేసీఆర్ ఫై ప్రశంసలు కురిపిస్తూ మళ్లీ రాజకీయ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక ఇదే కాదు అప్పుడప్పుడు ఇండస్ట్రీ లోని కొంతమందిని టార్గెట్ చేస్తున్నట్లు ఆయన ట్వీట్స్ చేస్తూ వస్తున్నాడు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – బండ్ల గణేష్ కు మధ్య విభేదాలు వచ్చాయని , అందుకే ఆయన త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ ఉంటారని ఫిలిం సర్కిల్లో , సోషల్ మీడియా లో అంత మాట్లాడుకుంటుంటారు. భీమ్లా నాయక్ సినిమా ఈవెంట్ కి బండ్ల గణేష్ను పిలవలేదు. దీనికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు అందుకు సంబంధించిన ఒక ఆడియో కూడా లీక్ అయ్యింది.కాగా ఆ ఆడియో తనది కాదని బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ” మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ కూడా భక్తుడు గానే పొగరుగా ఉంటాడు.. అది మీకు నచ్చినా నచ్చకపోయినా” అంటూ ఫైర్ ఎమోజిని తన వ్యాఖ్యలకు జత చేశారు బండ్ల గణేష్.. ప్రస్తుతం ఈ ట్వీట్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ను ఉద్దేశించి పెట్టారా అంటూ కూడా నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.