మునుగోడు ఉప ఎన్నిక ఫై నిర్మాత బండ్ల గణేష్ కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక ఆసక్తి కలిగిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అన్ని పార్టీలు మునుగోడు ఫై ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా గెలిచి తీరాలని అన్ని పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. దీంతో మునుగోడు ఉప ఎన్నిక ఫై ఎవరు స్పందించిన సరే అది వైరల్ గా మారుతుంది.

తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో నిర్మాత బండ్ల గణేష్ మునుగోడు ఉప ఎన్నిక ఫై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ పార్టీ పునర్జన్మను ఇచ్చే ఎన్నిక అన్నారు. మునుగోడులో బీజేపీ మూడో స్థానమేనని.. ఆ పార్టీ ప్రజలు తరమికొడతారని తేల్చి చెప్పారు. అక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీకి, కాంగ్రెస్‌ పార్టీకి మధ్య పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ ను సింగపూర్‌, దుబాయ్‌ కంటే ఎక్కువగా అభివృద్ధి చేశారని కేసీఆర్‌ ను కొనియాడారు. గణేష్ మాటలను బట్టి చుస్తే టిఆర్ఎస్ గెలుపు ఖాయంగా చెప్పకనే చెప్పారు.

ఇదిలా ఉంటె ఈ నెల 21 న మునుగోడు లో బిజెపి భారీ సభ నిర్వహించబోతుంది. ఈ సభ కు కేంద్ర మంత్రి అమిత్ షా తో పాటు అనేక మంది బిజెపి నేతలు హాజరు కాబోతున్నారు. ఈ సభ లోనే కోమటిరెడ్డి రాజగోపాల్ బిజెపి లో చేరనున్నారు. అలాగే పలువురు ఇతర పార్టీల నేతలు సైతం బిజెపి కండువా కప్పుకోబోతున్నట్లు వినికిడి.