తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం అంటూ బండ్ల గణేష్ ట్వీట్

bandla ganesh
bandla ganesh

నటుడు , నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియా లో ట్వీట్స్ అయినా , సినిమా ఫంక్షన్లలో నైనా బండ్ల గణేష్ స్పీచ్ కోసం , ట్వీట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తుంటారు. ఆ మధ్య రాజకీయాల్లోకి ఇకరాను అని తేల్చి చెప్పిన గణేష్..తాజాగా శుక్రవారం తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం అంటూ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు.

“నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా. బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై. రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజకీయాలంటే కష్టం రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా” అంటూ బండ్ల గణేశ్ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్లు వైరల్ కావడంతో చాలా మంది ఫ్యాన్స్.. ఆయన త్వరలోనే తన దేవుడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో చేరుతున్నారని అంటున్నారు. మరి నిజంగా గణేష్ జనసేన లో చేరతాడా..లేక మరో పార్టీ లో చేరతారా అనేది చూడాలి.

https://twitter.com/ganeshbandla/status/1657058212343078912?s=20
https://twitter.com/ganeshbandla/status/1657057464335101953?s=20
https://twitter.com/ganeshbandla/status/1657056939287937024?s=20