కేంద్ర మంత్రికి బండి సంజ‌య్ లేఖ‌

జోగులాంబ గద్వాల జిల్లాకు మెడిక‌ల్ కాలేజీ మంజూరు చేయాలి

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు లేఖ రాశారు. జోగులాంబ గద్వాల జిల్లాకు మెడిక‌ల్ కాలేజీ మంజూరు చేయాలని ఆయ‌న కోరారు. దాని ఏర్పాటుకు కావాల్సిన భూములను ఇప్పటికే సేకరించినట్లు ఆయ‌న గుర్తు చేశారు. జిల్లాకు 300 పడకల మెడిక‌ల్ కాలేజీ కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ‌లోనే గద్వాల జిల్లా బాగా వెనుకబడింద‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఈ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని కోరుతూ పలువురు ప్రతిపాదించార‌ని ఆయ‌న వివ‌రించారు. కాగా, జోగులాంబ గద్వాల జిల్లాకు మెడిక‌ల్ కాలేజీ మంజూరు చేయాలన్న డిమాండ్ గ‌త కొంత కాలంగా ఉన్న విష‌యం తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/