బండి సంజయ్‌ అధ్యక్షుడిగానే కొనసాగుతారు – ఈటెల క్లారిటీ

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు విషయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్‌ నే అధ్యక్షుడిగా కొనసాగుతారు అందులో ఎలాంటి మార్పు ఉండదని ఈటెల స్పష్టం చేసారు. తనకు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వరని తేల్చి చెప్పేశారు. ఎన్నికలు దగ్గరలో ఉన్నందున ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు, నన్ను ఎలా వాడుకోవాలో బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుందన్నారు.

పార్టీ లో ఉన్న పాత వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి ఘర్షణ వాతావరణం ఉండడం సహజం అని , పాత కొత్త అని బేదం ఉండకూడదు అని అధిష్టానమే చెబుతోంది. ప్రజా క్షేత్రం లో పేరున్న వారికే టికెట్లు వస్తాయని వెల్లడించారు. పొంగులేటి, జూపల్లి ని ఈ మధ్య బీజేపీ పార్టీ లో చేరమని అడిగానని.. మా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం అన్నారని ఈటల స్పష్టం చేశారు.