కేసీఆర్ వ్యాఖ్యలను తాము తేలిగ్గా తీసుకోబోము

పార్టీ లీగ‌ల్ సెల్‌తో బండి సంజ‌య్ భేటీ

హైదరాబాద్: బీజేపీ లీగల్‌ సెల్‌ ప్రతినిధులతో ఆ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్ హైద‌రాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశమ‌య్యారు. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, లీగల్‌సెల్‌ ప్రతినిధులు, నాయకులు ఈ స‌మావేశం పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ ఇటీవ‌ల తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల విషయంలో న్యాయపరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై సమీక్షిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై మండిప‌డ్డారు. రాజ్యాంగాన్ని మారుస్తానని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై న్యాయపరంగా ఎలా వ్యవహరించాలన్నదానిపై చర్చించామ‌ని చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలను తాము తేలిగ్గా తీసుకోబోమ‌ని బండి సంజయ్ అన్నారు. త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ గురించి ఆయ‌న ఈ రోజు ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది. కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే బండి సంజ‌య్ ఢిల్లీలోనూ దీక్ష చేసిన విష‌యం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/