రాష్ట్ర మహిళా కమిషన్‌కు బండి సంజయ్ లేఖ

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ కి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 15న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్‌కు బండి సంజయ్ లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా విచారణకు హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు. ఈనెల 18 వరకు బండి సంజయ్ సమయం కోరుతూ లేఖ రాశారు
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితక్కను అరెస్ట్ చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా ? అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై యావత్ బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..బండి సంజయ్ దిష్టి బొమ్మను తగలపెట్టారు. అంతే కాదు అనేక పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్ ఫై పిర్యాదులు చేసారు. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ కు పిర్యాదు చేయడం తో ..రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది.