ఢిల్లీకి బండి సంజయ్..

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరికాసేపట్లో ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. ఈరోజు ఉప రాష్ర్టపతి ఎలక్షన్ ఉండడంతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేయనున్నారు. దీంతో ఈరోజు ఒక్కరోజు పాదయాత్రకు బండి సంజయ్ విరామం ఇచ్చారు. మళ్లీ రేపటి నుంచి ఎప్పటిలానే పాదయాత్ర కొనసాగనుందని బీజేపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ పర్యటనలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసే అవకాశం ఉంది.

ఈనెల 21న మునుగోడులో బహిరంగసభ, పాదయాత్ర ముగింపు సభలకు వీరిద్దరినీ ఆయన ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. బీజేపీ పాదయాత్ర విశేషాలను, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను, బీజేపీలోకి రావాలనుకుంటున్న నాయకుల లిస్టుపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటు బండి సంజయ్ ఆహ్వానం మేరకు దాసోజు శ్రావణ్ ఢిల్లీ వెళ్తున్నారు. నిన్ననే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజ్ శ్రావణ్.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.