టీఆర్ఎస్ పార్టీని నడిపేది కేసీఆర్ కాదు.. ఓవైసీ – బండి సంజయ్

టీఆర్ఎస్ పార్టీని నడిపేది కేసీఆర్ కాదు.. ఓవైసీ అని కీలక వ్యాఖ్యలు చేసారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. బండి సంజయ్ చేపట్టిన నాల్గో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. మల్కాజిగిరి ఏరియాలో కొనసాగుతోంది. ఈ సందర్బంగా మల్కాజిగిరి చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగిస్తూ.. తెలంగాణ సర్కార్ ఫై ఘాటు విమర్శలు చేశారు.

టీఆర్ఎస్ పార్టీని నడిపేది కేసీఆర్ కాదు.. ఓవైసీ అని, నిజాంకు వ్యతిరేకంగా పోరాడి 4500 మంది ప్రాణాలు అర్పించారని.. అలాంటి చరిత్ర నేపథ్యంలో.. కేసీఆర్ జాతీయ సమైక్యతా దినోత్సవం అనడం సిగ్గు చేటని విమర్శించారు. నిజాం హైదరాబాద్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేయాలని ప్రయత్నించినందునా.. జాతీయ సమైక్యత దినోత్సవానికి అర్థం లేదన్నారు. నిజాం, రజాకార్ల అరాచకాల గురించి కేసీఆర్ మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సార్ పార్టీ కారు.. పెద్ద రజాకార్ అని వ్యాఖ్యానించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు.. సీఎం వారంలోగా జీవో తెస్తే.. ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్, క్యాసినో స్కామ్, ఇసుక, డ్రగ్స్ మాఫియా.. ఈ కుంభకోణాలన్నింటిలోనూ కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో అత్యధిక అభివృద్ధి కేంద్రం ఇచ్చే నిధులతోనే జరుగుతోందని వివరించారు.

కేసీఆర్ ప్రగతి భవన్‌ను వేరే పనులకు మార్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సార్ పార్టీ కారు.. పెద్ద రజాకార్ అని వ్యాఖ్యానించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు.. సీఎం వారంలోగా జీవో తెస్తే.. ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.