రాహుల్ గాంధీ ఏదో షికారుకు వచ్చినట్లు వచ్చాడు – బండి సంజయ్

bandi-sanjay-slams-trs

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఫై బిజెపి , టిఆర్ఎస్ పార్టీల నేతలు వరుస కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాహుల్ టూర్ పట్ల ఎద్దేవా చేసాడు. రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండో తెలియదని… ఏదో షికారుకు వచ్చినట్లు వచ్చాడని కామెంట్స్ చేసాడు. అధికారంలోకి రాని వారు ఎన్నో హామీలు ఇస్తారని విమర్శించారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏం అయ్యాయని ప్రశ్నించారు.

మోదీ సర్కార్ రైతుల సంక్షేమం కోసం ఎమ్మెస్పీని పెంచిందని బండి సంజయ్ అన్నారు. దేశం మొత్తం ధాన్యాన్ని బీజేపీ సర్కార్ కొంటుందని ఆయన అన్నారు. బీజేపీ లో గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లలేదని… కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే టీఆర్ఎస్ పార్టీ లోకి చేరారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ నోటి నుంచి ఒక్కసారి కేసీఆర్ అనే మాట వచ్చిందా..? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండూ బీజేపీతోని కొట్లాడుతుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ టూరిస్టులాగా దేశం మొత్తం తిరుగుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ పిట్ట కథలు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదని బండి సంజయ్ అన్నారు.