టిఆర్‌ఎస్‌ పతనం ఖాయం

Bandi Sanjay
Bandi Sanjay

కరీంనగర్‌: హుజురాబాద్‌లో ఈరోజు బిజెపి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కేంద్రం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని, అక్రమాలకు పాల్పడిన టిఆర్‌ఎస్‌ నాయకుల్ని జైలుకి పంపుతామని ఆయన అన్నారు. కాగా టిఆర్‌ఎస్‌ పతనం ఖాయమన్నారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య, కొండగట్టు ప్రమాదం, నేరెళ్ల బాధితుల పాపం టీఆర్‌ఎస్‌కు తప్పక తగులుతుందని సంజయ్ అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/