కెసిఆర్‌ ప్రభుత్వం ముగింపు దశకు చేరుకుంది

Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar

సిద్దిపేట: తెలంగాణ బిజెపి ఎంపి బండి సంజయ్  నిర్వహిస్తున్న గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా ఆయన హుస్నాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్  మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్‌ పాలనలో గ్రామాలకు ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. అప్పుల్లో ఉందని ఆర్టీసిని మూసేస్తే.. మరి రాష్ట్రం కూడా అప్పుల్లోనే ఉంది మూసేస్తారా? అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో రవాణాశాఖ మంత్రిగా ఆర్టీసికి లాభాలు తెచ్చి పెట్టానన్న కెసిఆర్‌, తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు అప్పులు అయ్యేలా చేశాడో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసి అప్పులకు కార్మికులు బాధ్యులైతే మరి ప్రభుత్వ అప్పులకు ఎవరు కారకులో చెప్పాలన్నారు. అప్పుల్లో ఉన్న ఆర్టీసిని ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రం కూడా అప్పులోనే ఉందని దానికి కారణమైన తను కూడా నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఫసల్‌ భీమా యోజనను రైతులకు వర్తించకుండా అడ్డుకున్నాడని, కేంద్ర ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించారని తీవ్రంగా విమర్శించారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/