బండారు దత్తాత్రేయకు అస్వస్థత

హైదర్ గూడ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

Bandaru Dattatreya
Bandaru Dattatreya

హైదరాబాద్‌: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. వైద్య బృందం ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారనే వార్తతో బిజెపి శ్రేణులు షాక్ కు గురయ్యాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/