చేనేత చిత్ర రూపం బెనారస్‌

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌

Banarasi Sarees
Banarasi Sarees

చీరల గురించి చెప్పాలంటే వాటిలో ముందుగా గుర్తొచ్చేవి పట్టు చీరలే. పట్టు చీరల్లోనూ బాగా పేరుగాంచిన బెనారస్‌, కంచి, ధర్మవరం చీరలంటే మహిళలకు చాలా ఇష్టం.

అందులోనూ బెనారస్‌ చీరలు ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పుట్టిన ఈ చీర దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపం చంలో చాలా మంది మనసులను దోచేసుకుంది.

మనదేశంలో అద్భుతమైన చేనేత కళకు చిత్ర రూపం ఈ బెనారసీ చీరలు.

ప్రస్తుతం వస్తున్న బెనారసీ చీరలు ఇండో మొఘల్‌ సంస్కృతుల సంగమంగా తయారైన చీరలే.

పురాతన కాలం నుండి కొనసాగుతున్న ఈ కళ అద్భుతమైన జరీ వర్క్‌తో పాటు అటు సంప్రదాయాన్ని, ఇటు ఆధునికతను చాటే డిజైన్లతో ఈ చీరలు సిద్ధమవుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/