అరటితో అరవై రకాల మేలు

Banana Tree
Banana Tree

”అ అమ్మ- ”అ అరటి అంటూ అక్షరాలు పసిపిల్లలకు పాటలతో నేర్పుతాం. అరటికి అమ్మంత ప్రాధాన్యం ఉంది మరి. శుభ అశుభ కార్యాలన్నింటికీ ‘అరటి అతిథే! అందుకే అరటి కుటుంబం మన ముందు హాజరవ్ఞతుంది అన్ని ఫంక్షన్లకూ. అరటి పిలకలు, అరటి ఆకులు, పండ్లు, కాయలు, పెండ్లిళ్లకు, పేరంటాళ్లకు, పూజలకు, వ్రతాలకు, నోములకు, గళ్లీల్లో, గోపురాల్లో అన్నిచోట్లా, అన్ని సందర్భాలలో ‘అరటికే ప్రముఖస్థానం. అరటి మన ఇంటి కల్పవృక్షం.
అరటి పిలకలను స్తంభాలకు కట్టడం ఉత్సవ సమయాల్లో ఆనవాయితీ.
అరటి పండ్ల నైవేద్యం అర్పించని పూజ, దేవ్ఞడు మనకు ఉండవ్ఞ.
అరటి ఆకులో అతిధులకు కమ్మని భోజనం వడ్డిస్తాం.
ఎండు అరిటాకు దొన్నెలు,ప్లేట్లు, ప్రసాదాలు, పాయసం సర్వ్‌ చేయ్యడానికి వాడతాం.
అరటికూర, పిండిమిరియం, సాంబారు, బజ్జీలు, చిప్స్‌ వేటికవే ప్రత్యేక రుచి.
అరటిదూట కూర పీచుతో ఉండటం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకే కాక అందరికీ ఎంతో ఆరోగ్యకరం. ఆవపెట్టి వండితే మరింత రుచి.
కర్ణాటకలో కొన్ని హోటల్స్‌లో అరటి ఆకుల్లో, కోన్‌ ఇడ్లీలు ప్రత్యేక ఆకర్షణ.
అరటినారతో పూలు కట్టడమే కాక, వింతైన బ్యాగ్స్‌ అనేక రకాల అలంకరణ వస్తువ్ఞలు తయారుచేస్తున్నారు. అరటి కాండపు దొన్నెలలో తమలపాకులు భద్రపరచి రవాణా చేస్తారు.