ఇటలీ రక్షణ సంస్థపై నిషేధం ఎత్తివేత!

న్యూఢిల్లీ: రూ.3,600 కోట్ల వీవీఐపీ హెలికాప్టర్ కుంభకోణానికి సంబంధించి.. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌లో భాగమైన ఇటలీ రక్షణ రంగ దిగ్గజం లియోనార్డోపై నిషేధాన్ని ఎత్తివేయాలని భారత్ నిర్ణయించింది. పలు షరతులతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఇటలీ సంస్థపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు కొనసాగనున్నది. భారత్‌లో ఆర్థిక సమస్యల విషయానికి వస్తే.. లియోనార్డో మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుందని, అంటే.. లియోనార్డో ఇంతకు ముందు చేసుకున్న ఒప్పందం ఆధారంగా భారత్‌పై ఎలాంటి వాణిజ్య దావా వేయలేరని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఈ నిషేధం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు సంబంధించింది కాగా.. కేసులో అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చాక ఇటాలియన్‌ సంస్థతో ఒప్పందాన్ని నిలిపివేశారు. ఇందులో బ్లాక్‌ టార్పెడో డీల్‌ సైతం ఉండగా.. నావికాదళం కొనుగోలు కోసం ఆమోదించారు. సమాచారం మేరకు.. ఇటలీ సంస్థ అభ్యర్థన మేరకు న్యాయమంత్రిత్వ శాఖ, దర్యాప్తు సంస్థలను సంప్రదించిన అనంతరం రక్షణ మంత్రిత్వ శాఖ నిషేధం ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రూ.3600కోట్ల వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో రాజీవ్‌ సక్సేనా అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/