భారత్ విమానాల రాకపై నిషేధం : శ్రీలంక ప్రకటన
శ్రీలంక పౌర విమానయాన సంస్థ వెల్లడి

భారత్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో భారత్ నుంచి తమ దేశానికి వచ్చే విమానాలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని శ్రీలంక ప్రకటించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు శ్రీలంకలో దిగేందుకు ఇకపై అనుమతించబోమని శ్రీలంక పౌర విమానయాన సంస్థ స్పష్టం చేసింది. భారత్ లో కరోనా విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/