15 ఏళ్లకు పైబడిన వాహనాలు ఇక చెత్తలోకే..!

కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త చట్టం

ban on old vehicles-The central government will soon enact a new law
ban on old vehicles-The central government will soon enact a new law

ముంబై,: 15 సంవత్సరాల కంటే పాత బైకులు, కార్లు ఉన్నాయా! ఉంటే మాత్రం బయటకు తీసుకురావొద్దు. బయటకు తీసుకొచ్చాంటే ఇక అంతే సంగతులు. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకు రాబోతోంది. ఆ చట్టం ప్రకారం 15యేళ్లపైబడిని కార్లు, బైకులు మొత్తం చెత్త కింద పడేయాల్సిందే. చెత్త కింద పడేయడం ఇష్టం లేకపోతు మీరు ఇనుపసామాన్లకు అమ్ముకోవాల్సిందే. కేంద్రం తీసుకురాబోయే కొత్త చట్టం గురించి ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ విషయాన్ని తెలియచేశారు.

15 యేళ్ల కంటే పాతవైన వాహనాల ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోంది. దీంతోపాటు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా రకరకాలైన వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. కాలుష్యరహితమైన వాహనాలు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో కొత్త వాటికి రూట్‌ క్లియర్‌ చేసేందుకు, కాలుష్యాన్ని తగ్గిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. భారత ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్‌ ఆ రోజు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కరోనా వల్ల అన్ని రంగా లు నష్టపోయినట్లే ఆటోమొబైల్‌ రంగం కూడా పెద్ద ఎత్తు న నష్టపోయింది. ఈక్రమంలో ఆ సెక్టార్‌ కేంద్ర బడ్జెట్‌ మీద భారీ ఆశలు పెట్టుకుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం తాము చేస్తున్న కృషికి కేంద్రం నుంచి సానుకూల స్పంద న రావాలని కోరుకుంటోంది. ఆటోమొబైల్‌ రంగానికి కొత్త ఉత్సాహం ఇచ్చేందుకు బహుశా బడ్జెట్‌లో దీనిపై కేంద్రం ప్రతిపాదన చేసే అవకాశం ఉన్నట్లు కూడా భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ అంశం కేంద్ర ప్రతిపాదనలో ఉంది. దీనికి ప్రధాన మంత్రి కార్యాలయం ఆమోదం తెలిపాల్సి ఉంది. తాము ప్రతిపాదించిన పాలసీ క్లియర్‌ అయితే భారత్‌ ఆటోమొబైల్‌ హబ్‌గా మారుతుందని నితిన్‌ గడ్కరీ అన్నా రు. పాత వాహనాలను స్క్రాప్‌ కింద అమ్మితే, వాటిని ఆటోమొబైల్‌ కంపెనీలు కొనుగోలు చేసి, ఆ ముడిసరుకు ద్వారా కొత్త వాహనాలు తయారు చేసేందుకు వీలవు తుందని, దాని వల్ల ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి కూడా ఇలాంటి స్క్రాప్‌ వాహనాలను తీసుకుని, దాని ద్వారా రీసైకిల్‌ చేసిన వాహనాలు తయారు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. దీని వల్ల కంపెనీల మీద కూడా ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. దేశంలో ఆటోమొబైల్‌ రంగం విలువ 4.5 లక్షల కోట్ల రూపాయలు. అందులో 1.5 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు ఉన్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/